SRD: జిల్లాలోని రైతులు తమ పంటల వివరాలను ఈ నెల 30 లోపు ఆన్ లైన్ చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ లైన్ చేయకుంటే సీసీఐలో పంటలు అమ్ముకునేందుకు వీలు ఉండదని చెప్పారు. మండల వ్యవసాయ శాఖ అధికారుల వద్ద తమ వివరాలను నమోదు చేయించాలని సూచించారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.