మేడ్చల్: ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డికి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్రద్ధాంజలి తీర్మాన కాపీని వారి కుటుంబ సభ్యులకు ఉప్పల్ MRO వాణీ రెడ్డి అందజేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన రాజిరెడ్డి, ప్రజలకు అందించిన విశేష సేవలను స్మరిస్తూ, 2025 ఆగస్టు 31న తెలంగాణ శాసనసభ ఘనంగా నివాళులర్పించింది.