HYD: 8 తెలుగు, 3 కన్నడ, 5 మరాఠీ జిల్లాల సమూహమే హైదరాబాద్ సంస్థానం. దేశంలోని 550 సంస్థానాల్లో అతిపెద్దది. నాడు కోటీ 80 లక్షల జనం ఉంటే ఇందులో 50 శాతం తెలుగువారే. 25 శాతం మరాఠీ, 12 శాతం ఉర్దూ, 11 శాతం కన్నడ, ఇతర భాషాల వారు HYD సంస్థానంలో ఉండేవారు. ప్రపంచంలోనే ధనికుల్లో ‘నిజాం’ ఒకడిగా ఉండేవారని చరిత్ర చెబుతోంది. 1948 SEP 17న ఈ సంస్థానం కోసం ఆపరేషన్ పోలో జరిగింది.