ములుగు: వడ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన తాడ్వాయి మండల కేంద్రంలో జరిగింది. తాడ్వాయి-ఏటూరునాగారం మధ్య తాడ్వాయికి రెండు కిలోమీటర్ల దూరంలో ఐకేపీ సెంటర్‌కు వడ్లు తరలిస్తున్నారు. ఈ క్రమంలో లోడు వన్ సైడ్ కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.