RR: రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో నకిలీ వైద్యుల బెడద పెరుగుతుంది. గడిచిన రెండేళ్ల వార్షిక నివేదికలను పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఈ రెండు జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 34, మేడ్చల్ జిల్లాలో 32 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఒక్కో ఎఫ్ఐఆర్లో రెండు నుంచి ఐదు కేసులు ఉంటాయని మెడికల్ కౌన్సిల్ సభ్యులు తెలిపారు.