KMM: ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని టీవీఎం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం టిఎంఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గణిత ప్రతిభ టెస్టు నిర్వహించడం జరిగింది. ఈ టెస్ట్‌లో ప్రతిభ చాటిన విద్యార్థులకు మధిర మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.