BDK: గోదావరి వరద ప్రవాహం పెరిగి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మణుగూరు మండలంలో పోలీసులు రెవెన్యూ అధికారులు వరద ప్రభావిత ప్రాంతాలలో గురువారం పర్యటించారు. మణుగూరు తాహసీల్దార్ అద్దంకి నరేష్ కమలాపురం ప్రాంతంలో గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు.