SRCL: దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మహాలింగర్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో ప్రమిదలు వెలిగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.