SDPT: పోలీసుల ఆత్మహత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన రక్షకులకే రక్షణ కరువైందని ఆయన అన్నారు. ములుగు, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, పని ఒత్తిడి, పెండింగ్ హామీలను తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమని చెప్పారు.