MNCL: బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయం వీధి రోడ్ నెంబర్-1లో విద్యుత్ లైన్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని AE మంగళవారం ప్రకటనలో తెలిపారు. 34 స్క్వేర్ MM నుంచి 55 స్క్వేర్ MM వైర్ మార్చుట పనుల్లో భాగంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.