JN: తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా జనగామలో రజక సంఘం నాయకులు ఆదివారం మహా ప్రదర్శన చేపట్టారు. డప్పు చప్పుల్లతో స్థానిక ప్రెస్టన్ గ్రౌండ్ నుంచి ఎన్ఎంఆర్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు నరేశ్ అధ్యక్షతన జరిగిన మహాసభలో పలువురు అతిథులు పాల్గొన్నారు.