GDWL: పేదరికాన్ని జయించి డాక్టర్ అయిన బిడ్డను కుల వివక్షతో బలి తీసుకోవడం దారుణం అని డీసీసీ అధ్యక్షుడు పటేల్ రాజీవ్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ సంతోష్‌ను కలిసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రేమ పేరుతో మోసం చేసి లావణ్య మృతికి కారణమైన నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.