సిద్ధిపేట: కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ నుంచి వచ్చిన రాయల్టీ డబ్బులు నియోజకవర్గానికి కేటాయించకపోవడం అన్యాయమని అన్నారు. ఏ శాఖలో నిధులు లేక అభివృద్ధి జరగడంలేదని, గ్రామాల్లో రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయని అన్నారు.