KMM: వేంసూరు మండలం భరణిపాడులో శనివారం ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 70 మంది రోగులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సర్పంచ్ పర్సా ప్రసాదరావు మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు.