JGL: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మద్యం షాపుల నిర్వహణ కోసం చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియ సోమవారం నుంచి జోరందుకుంది. జిల్లాలో మొత్తం 71 మద్యం దుకాణాలు ఉండగా ఆదివారం వరకు 49 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక సోమవారం ఒక్క రోజే 86 దరఖాస్తులు రాగా మొత్తం 135 దరఖాస్తులు అయ్యాయి. ఆసక్తి గల వారు ఈనెల 18 లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఎక్సైజ్ అధికారులు కోరారు.