MNCL: రామకృష్ణాపూర్ ప్రాంతంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల మరమ్మతులు ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నాయని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల్లో భాగంగా కొత్త వాటర్ ట్యాంక్ ఫిక్సేషన్, ప్లంబింగ్ కనెక్షన్లతో పాటు అవసరమైన ఇతర సామగ్రి అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇళ్లలో అన్ని సదుపాయాలు ఉండేలా చూస్తామన్నారు.