HYD: నగరంలోనే కాదు, శివారులో కూడా మటన్ ధరలు ఆకాశాన్ని తాకాయి. ఒకప్పుడు ఆదివారపు విందుగా మిగిలిన మటన్ ఇప్పుడు విలాస వంటకంగా మారింది. నెల రోజులుగా కిలో మటన్ ధర రూ.1000గా కొనసాగుతోంది. మేకల, గొర్రెల కొరత, రవాణా ఖర్చులు పెరగడంతో ధరలు ఎగబాకినట్లు దుకాణదారులు చెబుతున్నారు. ఇంత ఖరీదైనా, కొనుగోలుదారులు వెనుకడుగు వేయకుండా, దుకాణాల వద్ద భారీ క్యూ కనిపిస్తోంది.