వనపర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన ఎన్నికల హామీల అమల్లో విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ విమర్శించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని దుయ్యబట్టారు. పెంచిన పింఛన్లు, రేషన్ కార్డులు, తులం బంగారం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.