NLG: బస్సుల్లో ప్రయాణికుల బంగారు ఆభరణాలు దొంగలిస్తున్న అంతరాష్ట్ర “థార్ గ్యాంగ్” ముఠా సభ్యుడిని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. చిట్యాల పీఎస్ పరిధిలో జరిగిన భారీ చోరీ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు మధ్యప్రదేశ్లోని థార్ జిల్లాలో నిఘా పెట్టి నిందితుడిని పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.85 లక్షల విలువైన 600 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.