BHPL: చిట్యాల మండలం నైన్పాక గ్రామానికి పరకాల RTC డిపో బస్సు రాత్రి 8 గంటలకు బయలుదేరి 10 గంటలకు చేరుకునేది, ఉదయం 5 గంటలకు తిరిగి పరకాలకు వెళ్ళేది. ఈ మధ్య కాలంలో సర్వీసు నిలిపివేయడంతో జడల్పేట, నైన్పాక గ్రామాలకు ప్రయాణించే వ్యవసాయదారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సు సర్వీసును తిరిగి పునరుద్ధరించాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.