PDPI: తరచుగా గృహహింసకు పాల్పడుతూ భార్యాపిల్లల బాగోగుల పట్ల శ్రద్ధ వహించని ప్రభుత్వ ఉద్యోగిని కలెక్టర్ కోయ శ్రీ హర్ష విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఓదెల మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న రవీందర్ భార్యాపిల్లలను పట్టించుకోకుండా వారి పోషణను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆయన భార్య ఆరోపించింది. ఈ మేరకు ఆమే కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు.