ELR: పెదవేగి మండలం రాట్నాలకుంటలోని శ్రీ రాట్నాలమ్మ అమ్మవారిని, సాయి బాబా వారిని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి అబ్బయ్య చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.