NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి గురువారం పాతపేటలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ రైతు బజార్, అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలోపు పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం కావాలని సూచించారు. అలాగే ఫ్లైఓవర్ నుంచి ప్రత్యేక ర్యాంపు నిర్మాణం చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.