మేడ్చల్: సాయికృష్ణ నగర్లో విద్యుత్ హెచ్చుతగ్గుల సమస్యను పరిష్కరించడానికి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ విద్యుత్ అధికారులతో కలిసి పర్యటించారు. పాత విద్యుత్ లైన్లను మార్చి కొత్తవి వేయాలని అధికారులు సూచించారు. అలాగే, కాలనీ రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేయించి, త్వరలో సీసీ రోడ్లు వేయిస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు.