KMM: తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మిట్టపల్లి సమీపంలోని శంకర్ దాదా వద్ద లారీ- కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.