SRD: గ్రామాల్లో సర్వే పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సిర్గాపూర్ ఎస్సై వెంకట్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తే ఆధార్ కార్డు, ఓటిపి, బ్యాంక్‌కు సంబంధించిన వివరాలు ఇవ్వొద్దని సూచించారు. ఏపీకే ఫైల్ ఓపెన్ చేయవద్దని తెలిపారు. సైబర్ నేరగాళ్ల వలలో పడితే డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుందన్నారు.