NGKL: గ్రామ ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు శనివారం సర్పంచ్ అబ్దుల్ రషీద్ తెలిపారు. కప్పర చంద్రయ్య ఇంటి నుంచి గొల్ల వెంకటయ్య ఇంటి వరకు దెబ్బతిన్న అండర్ డ్రైనేజీ పైపులైన్ల మరమ్మతు పనులను ఆయన ప్రారంభించారు. గ్రామంలో మురుగునీటి సమస్య తలెత్తకుండా నిరంతరం కృషి చేస్తామన్నారు.