VKB: నవాబుపేట్ మండలం చిట్టిగిద్ద గ్రామ రైతులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. RRR ప్రాజెక్టులో భూములు కోల్పోయి రోడ్డున పడుతున్నామంటూ సోమవారం రైతులు ‘చలో HMDA’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.