WGL: నెక్కొండ మండల కేంద్రం, చంద్రుగొండ, దీక్షకుంట తదితర గ్రామాల్లో ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా ఏర్పడిన విస్తృత నష్టాలను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) కేంద్ర బృందం ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. నీటమునిగిన వరి పంటలు, నివాస గృహాలు, ప్రభుత్వ పాఠశాలలు, పశువుల నష్టాన్ని బృందం ప్రత్యక్షంగా అంచనా వేసింది. బాధితులకు నష్టపరిహారం అందజేస్తామన్నారు.