మేడ్చల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు అపారమని కొనియాడారు. రాజీవ్ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యం అన్నారు.