VKB: దోమ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజమోని సత్తెమ్మ ఇల్లు భారీ వర్షాలకు కూలిపోయింది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు బొంగు మల్లేశ్ పరామర్శించారు. ప్రభుత్వం తరఫున బాధితులకు వెంటనే పరిహారం, గృహ నిర్మాణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.