KMM: జిల్లాలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐఎన్టీయూసీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా ఇంఛార్జ్ ఆర్టీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు సీహెచ్ విప్లవ కుమార్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల లైసెన్స్ రెన్యూవల్ ఫెనాల్టీ రద్దు చేయాలని, ఏజెంట్ల సహకారం లేకుండా లైసెన్సులు రెన్యూవల్ చేయాలని కోరారు.