KMR: ఉగాది పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉగాది, రంజాన్ సందర్భంగా వీక్లీ మార్కెట్లో ప్రజలు కిక్కిరిసారు. పచ్చడి తయారు చేసుకునేందుకు కుండలు, మామిడి కాయలు, వేప పువ్వు, కొబ్బరికాయలు, మామిడాకుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రంజాన్ సందర్భంగా వివిధ రకాల పండ్లు జోరుగా అమ్ముతున్నారు. పలు దుకాణాల్లో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.