MNCL: న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం (NILP)పై మండలంలోని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని మండల ఎంఈవో శైలజ తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. పట్టణంలోని జడ్పీ బాలికోన్నత పాఠశాలలో మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల హెచ్ఎంలకు ఎన్ఐఎల్పీపై శిక్షణ ఉంటుందన్నారు. ఆ కార్యక్రమానికి వారు సకాలంలో తప్పకుండా హాజరుకావాలన్నారు.