కామారెడ్డి జిల్లాలో సాగుకు యోగ్యంలేని భూముల లెక్కను అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. జిల్లాలో సాగుభూములు ఎంత సాగుకు పనికిరానివెంత లెక్కలు పకడ్బందీగా సేకరించాలని, చాలా మందికి సాగుకు యోగ్యం లేకుండా రాళ్లు రప్పలతో భూములు ఉన్నట్లు సమాచారం ఉందని వాటి లెక్క తీయాలని అధికారులను ఆదేశించారు.