MNCL: భారత జాతీయ విద్యార్థి సంఘం (NSUI) మంచిర్యాల పట్టణ అధ్యక్షుడిగా జుర్రు లోహిత్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తనను నియమించిన ఎమ్మెల్యే, డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖకు లోహిత్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.