HYD: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజిగూడ సర్కిల్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వర్గీయ మాజీ ప్రధాని దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన తెచ్చిన సంస్కరణలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపాయన్నారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.