GDWL: నిబంధనలు అతిక్రమించి ఫిజీషియన్ శాంపిల్స్ విక్రయించినా, రికార్డులు సరిగా లేకున్నా ఉపేక్షించబోమని గద్వాల్ జిల్లా ఇన్ఛార్జ్ డ్రగ్స్ ఇన్స్‌స్పెక్టర్ ఎస్.వినయ్ తెలిపారు. మానోపాడ్, ఉండవెల్లి, ఎర్రవల్లి మండలాల్లో మెడికల్ షాపులపై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో తొమ్మిది దుకాణాల్లో ఉల్లంఘనలు గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.