HYD: మహానగర వ్యాప్తంగా GHMCకి అనేక దుకాణాలున్నాయి. వాటిని అద్దెకు ఇచ్చి ఆదాయం పెంచుకునే ప్లాన్ చేస్తోంది. దాదాపు 954 దుకాణాలను అద్దెకు ఇచ్చేందుకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా లీజు ముగిసినా చాలా మంది ఖాళీ చేయకపోవడంతో వారిపై చర్యలు తీసుకోవాలని గ్రేటర్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.