NLG: గుండ్లపల్లి(డిండి) మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్ట్‌లో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమం సోమవారం ఉదయం 8 గంటలకు నిర్వహిస్తున్నట్లు మత్స్య శాఖ సొసైటీ డిండి ప్రాజెక్ట్ చైర్మన్ మేకల కాశన్న తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బాలునాయక్ హాజరై చేప పిల్లలు వదులుతారని తెలిపారు. మత్స్యకార సొసైటీ సభ్యులు, ముదిరాజ్ సంఘం పాల్గొనాలన్నారు.