NZB: ఎన్నికల్లో తనను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి పోరాడతానని MLC అభ్యర్థి ప్రొ. గోపాలం విద్యాసాగర్ అన్నారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన మాట్లాడారు. తాను విద్యావేత్తగా, అధ్యాపకుడిగా, ఉద్యమకారుడిగా పనిచేశానని గుర్తు చేశారు. ఒక విద్యావేత్తగా ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై తనకు అవగాహన ఉందన్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడే తత్వం తనదని చెప్పారు.