WGL: సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని ఎస్ఎఫ్ఎఐ వరంగల్ జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గీసుకొండ మండలం కేంద్రంలోని బీసీ హాస్టల్‌ను సందర్శించారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచకపోవడం వల్ల నాణ్యమైన భోజనం అందడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మెస్‌ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.