HYD: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్ కనకాల కట్ట మైసమ్మ భక్తులకు శ్రీ సరస్వతి అమ్మవారి రూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారికి ఆలయ ఛైర్మన్ గౌతమ్ కుమార్, కార్యనిర్వాహక అధికారి సాంబశివరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు.