BDK: అశ్వాపురం మండలంలో ఈనెల 12వ తేదీన జరిగే పామాయిల్ సాగు అవగాహన సదస్సుకు హాజరుకావాలని వ్యవసాయ శాఖ అధికారులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణకి గురువారం ఆహ్వాన పత్రికను అందజేశారు. పామాయిల్ సాగుపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు నిర్వహించే అవగాహన సదస్సుకు అధ్యక్షత వహించాలని ఎమ్మెల్యేను కోరారు.