NZB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరై మాట్లాడారు. దేశంలో మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకువచ్చిందని, రైతాంగమంతా ముక్త కంఠంతో నినదించి తిప్పి కొట్టారని అన్నారు.