JGL: జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐలలో ఎలక్ట్రిషియన్, ఫీట్టర్, డీజిల్ మెకానిక్, కోపా ట్రేడ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఈనెల 21న ఉదయం 10:30 గంటలకు జగిత్యాల ప్రభుత్వ ఐటీఐలో నేషనల్ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రవీందర్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు అప్రెంటిస్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని సరైన ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.