KMM: మున్నేరు వరద బాధితుల సహాయార్ధం జిల్లా కలెక్టర్ పిలుపుమేరకు ‘నా ఖమ్మం కోసం-నేను.. సేవా’ కార్యక్రమంలో భాగంగా వైరా పట్టణం గాంధీనగర్ లోని శ్రీ సాయి వాసవి మహిళా భజన బృందం తరుపునా రూ.14,000 చెక్కును కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్కు విరాళంగా అందజేశారు. ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడంలో చాలా సంతోషంగా ఉందన్నారు.