SRD: గ్రామాల్లో పొదుపు సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని డీపీఎం మల్లేశం పేర్కొన్నారు. మంగళవారం కంగ్టి మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు ఆలూరే మహానంద అధ్యక్షతనలో MS మీటింగ్ జరిగింది. ఇందులోడ్వాక్రా సంఘాల ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు లింకేజీ, శ్రీనిధి, మహిళా శక్తి, గ్రామాల్లో స్వచ్ఛతపై తదితర అంశాలపై చర్చించారు.