MBNR: జిల్లా కేంద్రంలోని సర్వే నంబర్ 25 సాంబశివాలయం దగ్గర గౌడ సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని గౌడ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్టు గ్రేట్ అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్ వెల్లడించారు. సీడీపీ నుంచి నిధులను కేటాయిస్తామన్నారు.