NZB: స్థానిక సంస్థల రిజర్వేషన్ల దామాషాపై తెలంగాణ బీసీ కమిషన్ నిజామాబాద్ కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన బహిరంగ విచారణ సందర్భంగా అఫిడవిట్ రూపంలో మొత్తం 128 విజ్ఞప్తులు వచ్చాయని కమిషన్ ఛైర్మన్ నిరంజన్ తెలిపారు. ఇందులో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 102 వినతులు, కామారెడ్డి జిల్లాకు సంబంధించి 26 వినతులు వచ్చాయని వివరించారు.